Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే వ్యక్తి తిరువణ్ణామలై మోక్ష మార్గంలో (ఇడుక్కు పిల్లయ్యార్ గుహ) చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన మణికుమార్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో రాజమహేంద్రవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రోజు రాత్రి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరువణ్ణామలై వెళ్లాడు. స్వామివారి దర్శనం అనంతరం గిరి ప్రదక్షిణ చేస్తూ.. ఇడుక్కు పిళ్లైయార్ గుహను సందర్శించేందుకు వెళ్లాడు. రాత్రి పదకొండు గంటల సమయంలో మోక్ష మార్గంలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. లావు కారణంగా అతడు ఇరుక్కుని.. బయటకు రాలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు.
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
మోక్ష మార్గంలో చిక్కుకున్న మణికుమార్‌ను అక్కడ ఉన్న భక్తులు బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు అతడిని బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరువణ్ణామలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మణికుమార్ కుటుంబానికి అప్పగించారు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?