Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Sudarshan Reddy: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. హనుమకొండలోని ఆయన నివాసంలో ఉండగా.. ఉదయం ఒక్కసారిగా హాట్ స్ట్రోక్‌కు గురయ్యారు. కుటుంబీకులు ఆయనను వెంటనే వరంగల్‌లోని రోహిణీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సుదర్శన్‌రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు హుటాహుటిన వరంగల్‌లోని ఆసుపత్రికి వెళ్లారు.
ఇక, ఉద్యమ నాయకుడిగా పేరుగాంచిన పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్లో చురుగ్గా పని చేశారు. 2004 డిసెంబర్లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్‌గా, తదనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ వెంటే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. తిరిగి.. 2018 ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018లోనే తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ (Civil Supplies Corporation) ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
Also Read
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!