దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు.
గత నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్లో మహిళపై మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్ కేయ్ దాడికి తెగబడ్డాడు. పిడిగుద్దుల వర్షం కురిపించడంతో ఆమె నేలపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నవంబర్ నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ డోనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఈ నెల మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు అధికారిక ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్ సంపత్ శివంగి ఎంపికయ్యారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్ దూకుడికి బ్రేక్ పడింది. గత వారం రోజులుగా భారీ లాభాల్లో కొనసాగిన సూచీలు.. శుక్రవారం మాత్రం నష్టాల్లో ముగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభం కాగా.. ముగింపునకు వచ్చేటప్పటికీ నష్టాలను చవిచూసింది.
TCS : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది.
కుటుంబ సమస్యలు హత్యకు దారి తీశాయి. కరంజిత్ ముల్తానీ అనే వ్యక్తి.. తన సోదరుడ్ని కాల్చి చంపగా.. అడ్డొచ్చిన తల్లిని కాల్చడంతో ఆమె గాయపడింది. అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం శనివారం న్యాయార్క్‌లో చోటుచేసుకుంది.
టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై ఆ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు
అమెరికాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులు కూడా బాబర్ అండ్ కంపెనీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకటన కూడా తెరపైకి వచ్చింది.