విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి.
Israel: అమెరికా కాంగ్రెస్ ఇజ్రాయెల్ కోసం 13 బిలియన్ డాలర్ల కొత్త సైనిక సహాయాన్ని ఆమోదించింది. మరోవైపు ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
పాకిస్థాన్ క్షిపణి వ్యవస్థకు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం సాంకేతిక వస్తువులను సరఫరా చేసే చైనా, బెలారస్ కంపెనీలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిషేధించింది.
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య మరోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సిరియాలోని దమస్కు పట్టణంలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి తర్వాత మరింత ప్రమాదకరంగా మారింది. ఈ ఘటనలో పలువురు ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయిల్‌పై ఇరాన్ రగిలిపోతుంది. ఇప్పటికే హమాస్‌పై దాడి తర్వాత ఇజ్రాయిల్‌పై పగతో ఇరాన్ మండిపోతుంది. తాజా ఘటనతో అది కాస్తా ముదిరింది. ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. అమెరికాను హెచ్చరించింది.…
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్‌ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.
అమెరికాలో హిందువులకు వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నట్లు పెరిగిపోతున్నట్లు ఆ దేశానికి చెందిన చట్టసభ ప్రతినిధి థానేదార్ పేర్కొన్నారు. హిందూఫోబియాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
Telangana Student Died in US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పిట్టల వెంకట రమణ (27) మరణించాడు. మార్చి 9వ తేదీన విస్టిరీయా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్లో వెంకట రమణ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. వెంకట రమణ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు కారణాలతో ఎనిమిది మంది…
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో జరిగిన కవాతులో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా కనీసం 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
Winter storm hits US Northeast: అమెరికాలోని ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ను తీవ్ర మంచు తుపాను తాకింది. మంగళవారం ఉదయం నుంచే ఈశాన్య ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దాంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. శీతాకాలపు మంచు తుఫాను కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 1200 విమానాలు రద్దయాయి. కొన్ని చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. మరోవైపు పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా సహా పలు ప్రాంతాల్లో ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. పెన్సిల్వేనియా…