అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు వచ్చినా.. దేశం నుంచి బహిష్కరణ వేటు వేస్తున్నారు. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సురిని అమెరికా బహిష్కరణ వేటు వేసింది. అలాగే మరొక విద్యార్థిని రంజిని శ్రీనివాసన్‌ను కూడా బహిష్కరించింది. హమాస్‌కు మద్దతు ఇచ్చారన్న నేపథ్యంలో ఈ ఇద్దరి విద్యార్థులను అమెరికా బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: పలు రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. వెలుగులోకి దారుణాలు
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారతీయ విద్యార్థులు అమెరికా చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరింది. ఇక బహిష్కరణకు గురైన బాదర్ ఖాన్ సూరి, రంజిని శ్రీనివాసన్.. సహాయం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు అమెరికాలోని రాయబార కార్యాలయాల ద్వారా భారత విద్యార్థులకు సహాయం చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: George Foreman: ప్రముఖ బాక్సర్ కన్నుమూత..
రంజిని శ్రీనివాసన్.. కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్బన్ ప్లానింగ్ చదువుతోంది. అయితే పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా బహిష్కరణ వేటు వేసింది. వీసా రద్దు చేయడంతో ఆమె కెనడాకు వెళ్లిపోయింది. ఇక బాదర్ ఖాన్ సూరి… జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇరాక్-ఆప్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపించడం ఎలా అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా హమాస్ మద్దతుగా.. యూదు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా బహిష్కరణ చేసింది. అయితే బహిష్కరణపై వర్జీనియా కోర్టులో సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనాకు చెందిన అమెరికా పౌరురాలు కాబట్టే.. తనపై ముద్ర వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు బహిష్కరణ చేయొద్దని సూచించింది.
ఇది కూడా చదవండి: Posani Case : కోర్టు బెయిల్ ఇచ్చినా బయటకు రావడం డౌటేనా..?