Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు.
అగ్ర రాజ్యం అమెరికాలో బస్సు హైజాక్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఒక దుండగుడు హైజాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. బస్సును చుట్టుముట్టినట్లుగా సమాచారం. అయితే బస్సులో ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు. అలాగే హైజాకర్స్ ఎంత మంది ఉన్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.
ఒక ఫొటో ఇద్దరు కుబేరుల మధ్య వివాదానికి దారిసింది. అందులో ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కాగా.. ఇంకొకరు భారతీయ-అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా. ఒక తప్పుడు ఫొటో కారణంగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది.
కార్లలో అమర్చే సాఫ్ట్వేర్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్లలో చైనీస్ సాఫ్ట్‌వేర్‌ను నిషేధించాలని అమెరికా ప్రతిపాదించింది. జాతీయ భద్రతా సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనీస్ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్తో అనుసంధానించబడి ఉంటుంది.
భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది.
అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతల తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేష్ గుండెపోటుతో మృతిచెందాడు. రమేష్ యూఎస్‌లో ఎమ్మెస్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు.
ఈ మధ్య విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గగనతలంలోకి వెళ్లాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్య ఓ విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు ఆయా ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో కూడా భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.
అమెరికాలోని తాజా గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది.
అగ్ర రాజ్యం అమెరికాలో 22 అంతస్తుల టవర్‌ను సెకన్ల వ్యవధిలో కూల్చేశారు. లూసియానాలోని లేక్ చార్లెస్ ప్రాంతంలో పాడుబడిన హెరిటేజ్ టవర్ ఉంది. ఇటీవల తుపాన్‌కు దెబ్బకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా కూడా స్థిరత్వం రాలేదు. దీంతో టవర్‌ను కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు.