ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్‌కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు. కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్‌కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు.
వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. ఇందుకు ప్రపంచ మీడియా వేదిక అయింది. శాంతి చర్చలు సందర్భంగా ట్రంప్-జెలెన్ స్కీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది.
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది.
మొత్తానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు-ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది.
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి వచ్చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. రెండో విడత పాలనలో ట్రంప్ చర్యలు మరింత స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలోన్ మస్క్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల క్రితం మొదలైన యుద్ధానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు.