ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ తీవ్రంగా అతలాకుతలం అయిపోతున్నాయి. తాజాగా చైనా మీదైతే ఏకంగా 104 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించారు. దీంతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ట్రంప్‌తో చర్చించినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో లక్ష్యంగా మస్క్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పీటర్ నవారో నిజంగానే మూర్ఖుడు అంటూ మండిపడ్డారు.
టెస్లా కార్లకు సంబంధించిన చౌకైన విదేశీ భాగాలన్నీ చైనా నుంచే దిగుమతి అవుతుంటాయి. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, టైర్లు దిగుమతి అవుతుంటాయి. తాజాగా 104 శాతం సుంకం పెంచడంతో టెస్లా కార్లకు మరింత భారంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో చైనాకు మాత్రం సుంకాలు మినహాయించాలని మస్క్ విజ్ఞప్తి చేశాడు. కానీ అందుకు ట్రంప్ ఏ మాత్రం అంగీకరించలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: Prabhas : ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ అప్‌డెట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి..