అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత మస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం అధికారంలోకి వచ్చాక.. మస్క్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇదే రివర్స్ అయింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మస్క్ తీరును తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా సుంకాల విషయంలో ట్రంప్ తీరును మస్క్ తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మునుపటి వలే ఇద్దరి మధ్య సంబంధాలు లేవన్నట్టుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Trump-Musk: ట్రంప్-మస్క్ మధ్య చెడిన స్నేహం! సలహాదారుడిగా వైదొలిగే ఛాన్స్!
ప్రస్తుతం మస్క్.. ట్రంస్ సలహాదారుడిగా ఉన్నారు. త్వరలోనే ప్రభుత్వ పాత్ర నుంచి వైదొలగవచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మస్క్‌ను ప్రశంసించారు. మస్క్ అద్భుతంగా పని చేశారని కొనియాడారు. అతని కార్లలో ఒక దానిని అత్యధిక ధర చెల్లించి కొన్నట్లు చెప్పారు. టెస్లా కార్లకు మద్దతు ఇచ్చేందుకే కారు కొన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: KTR: హెచ్‌సీయు భూముల విషయంలో అతి పెద్ద కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. అత్యధికంగా చైనాపై సుంకాలు చెల్లించారు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరారు. కానీ అందుకు ట్రంప్ అంగీకరించలేదు. అనంతరం ట్రంప్ వాణిజ్య సలహాదారుడి తీరును మస్క్ తప్పుపట్టారు. మూర్ఖుడు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి చైనాకు తప్ప మిగతా దేశాల్లో 90 రోజులు సుంకాలను ట్రంప్ నిలిపివేశారు.
🚨TRUMP: "Elon has done a fantastic job. I don't need Elon for anything other than I happen to like him. I'm telling you, this guy did a fantastic job. I bought one of his cars and I paid TOP PRICE, you know what I do with it? I let the people in the office drive around with it.… pic.twitter.com/YJouFPdy3e
— Autism Capital 🧩 (@AutismCapital) April 10, 2025