అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైరయ్యారు. ఆ రిపోర్టర్‌ను ‘గెట్ అవుట్’ అన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
గాజా పరిస్థితి దయనీయంగా మారింది. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా మానవతా సాయం నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లభించక విలవిలలాడిపోతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం మంగళవారం పశ్చిమాసియాకు వచ్చారు. మంగళవారం నుంచి 4 రోజుల పాటు సౌదీ, యూఏఈ, ఖతార్‌లో పర్యటించనున్నారు.
Indo-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్ నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాడులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది
పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు.
అమెరికాలోని ఓర్లాండో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సిద్దపడుతుండగా ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ప్రయాణికులను వెంటనే కిందకు దించేశారు.