భారత సంతతి విద్యార్థిని సుదీక్ష (20) మిస్సింగ్‌పై ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని అధికారులను కోరారు. మీడియా సమావేశంలో లేఖను చూపించారు. ఈ సందర్భంగా సుదీక్ష ఎక్కి ఎక్కి ఏడ్చేసింది.
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక చాలా ఉల్లాసంగా సాగినట్లుగా కనిపిస్తోంది. వాతావరణం పూర్తిగా ఆమెకు అనుకూలంగా మారింది. ఇక ఆమె రాకను ప్రజలే కాదు.. ప్రకృతి కూడా పులకించింది. సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చిన క్యాప్సూల్.. సముద్రంపై ల్యాండ్ కాగానే ఆమె చుట్టూ డాల్ఫిన్ల గుంపు తిరుగుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరింది. దాదాపు 9 తొమ్మిది నెలల తర్వాత ఆమె భూమ్మీద అడుగుపెట్టింది. క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందించారు. అందరికీ హాయ్ చెబుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించారు. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చాలా ఉత్సాహంగా.. ఆనందంగా ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమ్మీద ల్యాండ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కోనంకి సుదీక్ష చౌదరి (20) భారత సంతతి విద్యార్థిని. అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది.
ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి శ్రీకారం చుట్టింది. గాజాలో హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు పాల్పడింది. హమాస్ ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయగా 300మంది చనిపోయారు. పదులకొద్దీ గాయాలు పాలయ్యారు. ఇక గాజాతో పాటు దక్షిణ సిరియా, లెబనాన్‌పై కూడా వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. 19 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
భారత సంతతి విద్యార్థిని కోనంకి సుదీక్ష చౌదరి (20) మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని వర్జీనియా నివాసి అయిన సుదీక్ష.. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా మాయం అయింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది.
సుదీక్ష కోనంకి భారత సంతతి విద్యార్థిని. అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. బీచ్‌లో నడుస్తుండగా అకస్మాత్తుగా మార్చి 6న అదృశ్యమైంది. దీంతో ఆమె స్నేహితులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు.