India US: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ సర్కార్ బహిష్కరిస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్‌సర్‌కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్సర్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి.
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చినట్లుగా ముంబై పోలీసులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. రెండో దఫా పరిపాలనలో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా బాటలోనే యూకే ప్రభుత్వం వెళ్తోంది. అక్రమంగా ఉంటున్న భారతీయులకు బేడీలు వేసి మరీ అమెరికా తిరిగి పంపించేస్తోంది. తాజాగా అదే బాటలో బ్రిటన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.