ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత.. ఇరాన్‌కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. శనివారం ఇరాన్ అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా అత్యంత శక్తివంతమైన బాంబర్లు దాడి చేశాయి.
ఇది కూడా చదవండి: Trisha : మహేశ్ బాబుతో నటించేటప్పుడు కాస్త గిల్టీగా ఫీల్ అయ్యా..
ఇక తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపింది. కానీ ఈ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి ఒప్పందం ఏం జరగలేదని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై మంగళవారం ఉదయం క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. అంతేకాకుండా పశ్చిమాసియాలో అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇరాన్, ఖతార్‌లో దాడులు చేసింది.
ఇది కూడా చదవండి: India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఎలా అంటే..?
జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇంతలో అమెరికా కూడా జోక్యం పుచ్చుకుని.. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా దాడులు చేసింది. దీంతో అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. అన్నట్టుగానే ఇరాన్.. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా దళాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.