అమోరికాలో వరుస విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్లైట్స్ కూలిపోవడం, మంటలు చెలరేగడం వంటి ఘటనలతో వణికిపోతున్నారు. తాజాగా యూఎస్ లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానం రెక్కలపైకి చేరుకున్నారు. ఈ ప్రమాదం అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగిన తర్వాత భయానక వాతావరణం ఏర్పడింది. Also Read:Trump:…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ వాదనను అతడి తల్లిదండ్రులు తోసిపుచ్చారు. కచ్చితంగా ఇదే హత్యేనని వాదించారు.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరోసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో భూమ్మీదకు తిరిగి రావడం ఆలస్యం కాబోతుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్లో నలుగురు వ్యోమగాముల సిబ్బంది ఉన్నారు.
డొమినికన్ రిపబ్లిక్లో మార్చి 6న తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి (20) ఆచూకీ ఇంకా లభించలేదు. వారం గడుస్తు్న్నా ఎలాంటి పురోగతి లభించలేదు. అధికారులు.. హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలతో జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు అడుగులు పడుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో చర్చలు జరుగుపుతోంది. తొలుత తమ పాత్ర లేకుండా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. తాజాగా శాంతి చర్చలకు ఓకే చెప్పింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్‌ను సందర్శించనున్నట్లు వర్గాలు పేర్కొ్న్నాయి. గత నెలలో జేడీ వాన్స్.. ఫ్రాన్స్, జర్మనీలో తొలి విదేశీ పర్యటన చేశారు. రెండో విదేశీ పర్యటన భారత్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కొత్త టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎరుపు రంగు టెస్లా కారును కొనుగోలు చేశారు. అనంతరం కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ కలియ తిరిగారు. తన స్నేహితుడికి మద్దతుగా కొత్త టెస్లా కారు కొంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ కారు కొనుగోలు చేసి వైట్‌హౌస్ ఎదుట డ్రైవింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం భారీగా సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే పరిస్తితి ఏర్పడింది.
పాకిస్థాన్ రాయబారి అహ్సాన్ వాగన్‌ను అమెరికా బహిష్కరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెల్లుబాటు అయ్యే వీసా, అలాగే చట్టపరమైన ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ లాస్ ఏంజిల్స్ నుంచి బహిష్కరణకు గురైనట్లు సమాచారం. అహ్సాన్ వాగన్.. తుర్క్మెనిస్తాన్లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. దీంతో వందలాది మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది.