ఇరాన్‌పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా కూడా రంగంలోకి దిగుతోంది. ఇంత జరుగుతున్నా ఇరాన్ మిత్ర దేశాలు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: YS Jagan: షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ జగన్ రియాక్షన్.. ఏమన్నారంటే?
బాగ్దాద్ నుంచి బీరూట్ వరకు ఇప్పటి వరకు ఫోన్ చేయకపోవడం ఇరాన్ నేతలు నిర్ఘంతపోతున్నారు. లెబనాన్‌లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్‌లో హౌతీలు, ఇరాక్‌లో షియా మిలీషియాలు కూడా స్పందించలేదు. ఇంకోవైపు అమెరికా కూడా రంగంలోకి దిగుతుంటే.. కనీసం ఖండించిన పాపాన పోలేదు.
ఇది కూడా చదవండి: #UBS : ‘ఉస్తాద్’తో శ్రీ లీల బర్త్ డే సెలబ్రేషన్స్.. పిక్ వైరల్!
నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్ పశ్చిమాసియాలో ప్రాక్సీ శక్తుల కూటమిని నిర్మించింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావాన్ని తిప్పికొట్టడానికి ఈ శక్తిని ఇరాన్ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ఘర్షణ నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ కూటమిని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ప్రాక్సీలు నిశ్శబద్దంగా ఉన్నాయి. వారం రోజులుగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నా.. కనీసం ఫోన్ చేసిన దాఖలే లేవు. మిత్ర దేశాల నుంచి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం ఇరాన్ ఒక్కటే ఒంటరిగానే పోరాడుతోంది. ఇక భారతదేశం కూడా మిత్ర దేశంగా ఉంది. పదేళ్ల పాటు ఇరాన్‌తో సంబంధాలు పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ కూడా స్పందించలేదు. ఇజ్రాయెల్ దాడులను ఖండించలేదు. కారణం.. రెండు దేశాలతోనూ భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ మౌనంగా ఉంది.