Trump: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరగబోతుంది.. ట్రంప్ కీలక ప్రకటన
- భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరగబోతుంది
- ట్రంప్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్’’లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో కీలక ఒప్పందం జరిగిందని.. త్వరలోనే భారతదేశంతో కూడా చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతుందని సూచనప్రాయంగా ట్రంప్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్‌కేకుల్లా మ్యాచ్ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
రెండు దేశాల బృందాలు నాలుగు రోజుల పాటు రహస్య చర్చలు జరిగాయని.. త్వరలోనే ప్రకటన రాబోతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని.. దానిలో భాగం కావాలని కోరుకుంటారని.. కానీ మేము ప్రతి దేశంతో ఒప్పందాలు చేసుకోమని ట్రంప్ తేల్చి చెప్పారు. కొంత మందికి చాలా ధన్యవాదాలు చెబుతూ లేఖలు కూడా పంపినట్లు చెప్పుకొచ్చారు. కొన్ని నెలల క్రితం పత్రికలు రకరకాలుగా రాశాయని.. మీతో ఒప్పందాలు చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించాయని.. కానీ నిన్ననే మేము చైనాతో సంతకం చేసినట్లు గుర్తుచేశారు. మాకు కొన్ని గొప్ప ఒప్పందాలు ఉన్నాయని.. త్వరలో ఒకటి రాబోతుందని.. బహుశా భారతదేశంతో అది చాలా పెద్దది అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Satya Prasad: వారిపై కఠిన చర్యలు తప్పవు.. నకిలీ ఈ-స్టాంపులపై మంత్రి సీరియస్..!
మెగా వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా మధ్య నాలుగు రోజుల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. రెండు దేశాల్లో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్, సుంకాల కోతలు, నాన్-టారిఫ్ అడ్డంకులపై దష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రతినిధి బృందానికి అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు నాయకత్వం వహించగా.. భారత బృందానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ల నుంచి 2023 నాటికి 500 బిలియన్లకు తీసుకెళ్లేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
జూన్ 10న ఇరు దేశాల చర్చలు ముగిసిన సందర్భంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే న్యాయమైన, సమానమైన వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపినట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రధాని మోడీ-ట్రంప్ 2025లో సమావేశం అయ్యారని.. ఇద్దరూ కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలకు, వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈనెల ప్రారంభంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావొచ్చన్నారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఉమ్మడి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
#WATCH | "…We just signed (trade deal) with China. We're not going to make deals with everybody… But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44
— ANI (@ANI) June 26, 2025
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!