ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం శాంతి వాతావరణం నెలకొంది. మంగళవారం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా చెప్పుకొచ్చారు. యుద్ధం ఆపాలని ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు కోరాయని.. ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాకే.. యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Phone Tapping: 4013 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు..!
ఇక నాటో సదస్సుకు వెళ్తుండగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో నాయకత్వ మార్పు గురించి స్పందిస్తూ అలా జరగాలని కోరుకోవడం లేదని చెప్పారు. అన్ని సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయని.. పాలన మారితే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Golden Gang Arrest: దొంగలకే దొంగ.. గజ దొంగ.. గోల్డెన్ గ్యాంగ్ అరెస్ట్..!
ఇక టెహ్రాన్‌లో అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో అమెరికా విఫలమైందంటూ వచ్చిన మీడియా కథనాలపై ట్రంప్ రుసరుసలాడారు. ఈ వార్తలన్నీ నకిలీ వార్తలని.. ఇరాన్‌లో పూర్తిగా అణు కేంద్రాలు ధ్వంసం అయినట్లుగా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడులను కించపరుస్తారంటూ ట్రంప్ మండిపడ్డారు. అధ్యక్షుడ్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ వైట్‌హౌస్ కూడా ఖండించింది.

ఇదిలా ఉంటే టెహ్రాన్ అణు కేంద్రాలను నాశనం చేయలేదని అమెరికా నిఘా వర్గాలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. కానీ ట్రంప్ మాత్రం ధ్వంసం అయ్యాయంటూ చెప్పుకుంటున్నారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు యుద్ధం సాగింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. మంగళవారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఇరాన్ క్షిపణి ప్రయోగించింది. దీంతో నలుగురు చనిపోయారు. ప్రతి దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించగా.. అలాంటిదేమీ లేదని ఇరాన్ ఖండించింది. మొత్తానికి ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొంది. ఇక దక్షిణ గాజాలో జరిగిన ఆపరేషన్‌లో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు చనిపోయినట్లు ఐడీఎఫ్ బుధవారం తెలిపింది.
🚨BREAKING: Trump Special Envoy Steve Witkoff says the fake news of Iran strike “intel” to CNN is treasonous and calls for an investigation:
“It’s treasonous. It has to be investigated… Should be held accountable… It was obliterated.”
pic.twitter.com/VOe4bF3b7L— Benny Johnson (@bennyjohnson) June 25, 2025