ఇరాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇరాన్‌పై దాదాపు రెండు వారాల పాటు చేసిన యుద్ధంలో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను చేరుకున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణు ముప్పును తొలగించినట్లు చెప్పారు. సైనిక మరియు భద్రతా అధికారులతో సంప్రదింపుల తర్వాత ఇజ్రాయెల్ కాల్పుల విరమణ నిబంధనలకు అంగీకరించిందని నెతన్యాహు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: AP Cabinet: కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఏంటంటే?
ఇరాన్ కూడా అధికారికంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Air India: ఓ వైపు అంతులేని విషాదం.. ఇంకోవైపు ఎయిరిండియా ఉద్యోగులు బ్రేక్ డ్యాన్స్‌లు.. వీడియో వైరల్
మంగళవారం ఉదయం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తొలుత అలాంటిదేమీ లేదని ఇరాన్ తెలిపింది. తిరిగి కొద్దిసేపటికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా వెల్లడించింది. ఇంతలోనే ఇజ్రాయెల్‌పై క్షిపణి ప్రయోగించింది. దీంతో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా భీకర దాడులు జరిగాయి. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఇంతలో అమెరికా జోక్యం పుచ్చుకుని ఇరాన్‌లోని మూడు ముఖ్యమైన అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. అనంతరం ఇజ్రాయెల్ కూడా దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. మొత్తానికి మంగళవారం ఉదయం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ వెల్లడించారు. తొలుత ఇరాన్ అంగీకరించలేదు. తాజాగా కాల్పుల విరమణ జరిగినట్లుగా ఇరాన్ పేర్కొంది.