హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాకిచ్చింది. యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని వైట్హౌస్ ఆరోపించింది.
ఇరాన్ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. న్యూయార్క్లో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. న్యూయార్క్లో ఒక చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీకి దక్షిణంగా శనివారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయి, ఒకరు మృతి చెందారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు తెలిపారు. Also Read:Prabhas : ‘స్పిరిట్’ మూవీ…
ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత మస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం అధికారంలోకి వచ్చాక.. మస్క్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గ్రీన్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒబామాతో కలిసి మిచెల్ రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణమైంది.
ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ తీవ్రంగా అతలాకుతలం అయిపోతున్నాయి. తాజాగా చైనా మీదైతే ఏకంగా 104 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించారు. దీంతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయింది.