India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయం, సమానంగా, సమతుల్యంగా జరిగిన తర్వాత మీరు తర్వాత శుభవార్త వింటారు అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం అన్నారు. ఈ ఒప్పందం భారతదేశ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ నిర్వహించిన ఇండో-అమెరికా ఆర్థిక సదస్సులో ఆయన…
Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే జనరిక్ ఔషధాలపై సుంకాలను మినహాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందులపై పన్నులు విధించాలా? వద్దా? అనే దానిపై నెలల తరబడి చర్చ జరిగిన తర్వాత జనరిక్ ఔషధాలపై సుంకాలను విధించే ప్రణాళికల్ని విరమించుకన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
USA: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. భారత్‌తో వాణిజ్యం, రష్యన్ ఆయిత్ దిగుమతులు ఆపివేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలతో ఇరు దేశాల ఉద్రిక్తతల మధ్య లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge: అమెరికా సుంకాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రధాని మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితులు కావచ్చు, కానీ మోడీ దేశానికి శత్రువు అయ్యారని ఆరోపించారు. కర్ణాటక కలబురిగిలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ ఒకరి కోసం ఒకరు ఓట్లు కోరినందున వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చని అన్నారు.
Donald Trump: తాను చేస్తే న్యాయం, అదే ఇతరులు చేస్తే అన్యాయం అన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అమెరికా రష్యాతో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ భారత్ చేస్తే మాత్రం అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడం అని విమర్శిస్తోంది. ఇదే కారణం చెబుతూ ట్రంప్, భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారు. అయితే, అంతటితో ఆగకుండా తాను చేస్తున్న పనినే మీరు చేయాలంటూ పలు దేశాలకు అమెరికా సూచిస్తోంది. ఇందతా చూస్తుంటే ‘‘తాను…
Trump Tariffs India: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం.. ఇవాళ (ఆగస్టు 27న) తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి కొత్త టారీఫ్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి ఇండియన్ ఎగుమతులపై మొత్తం 50 శాతం భారం పడనుంది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంపై ఆయన అభిప్రాయంతో సొంత దేశస్థులే అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల భారత్‌పై 25% సుంకం విధించిన భారతదేశాన్ని 'డెడ్ ఎకానమి' అంటూ ఎగతాళి చేశారు. ఇది అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు పెద్ద తప్పుగా నిపుణులు పరిగణిస్తున్నారు. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ టెస్ట్‌బెడ్ అధ్యక్షుడు కిర్క్ లుబిమోవ్..
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Donald Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌లు బాంబు పేల్చాడు. దాదాపు 70కి పైగా దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం పెట్టాడు.