India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయం, సమానంగా, సమతుల్యంగా జరిగిన తర్వాత మీరు తర్వాత శుభవార్త వింటారు అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం అన్నారు. ఈ ఒప్పందం భారతదేశ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ నిర్వహించిన ఇండో-అమెరికా ఆర్థిక సదస్సులో ఆయన వెల్లడించారు.
‘‘ఒక దేశంగా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. మన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలి. రైతులతో, మత్స్యకారులతో, చిన్న పరిశ్రమలతో మన సున్నితత్వాన్ని సమతుల్యం చేసుకోవాలి. రెండు దేశాలు సమాన పరిష్కారం కనుగొన్నప్పుడు మనకు ఫలితాలు లభిస్తాయి. ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు, మీరు శుభవార్త వింటారు’’ అని గోయల్ అన్నారు.
Read Also: PM Modi: మోడీ ధరించిన “వాచ్”పైనే అందరి చూపు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..
భారతదేశం, యూఎస్ మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 6 రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్నామని, ఇది చాలా ఏళ్ల ఒప్పందం కావచ్చని గోయల్ అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని, భాగస్వామ్యం నిరంతరం పెరుగుతుందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించిన తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారాయి. రష్యా నుంచి భారత్ ఆయిలు కొనుగోలు చేస్తుందని టారిఫ్ విధించారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా బాదం, పిస్తా, ఆపిల్స్, ఇథనాలు, జన్యుపరంగా మార్పు చేసిన వస్తువులకు భారత మార్కెట్ యాక్సెస్ కోరుతోంది. 2024-25లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది, ద్వైపాక్షిక వాణిజ్యం USD 131.84 బిలియన్లు (USD 86.5 బిలియన్ ఎగుమతులు)గా ఉంది.