India’s GDP: 2025-26లో భారత జీడీపీ వృద్ధి 7.4 శాతం..
- ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.4 శాతం..
- 2024-25తో పోలిస్తే పెరిగిన జీడీపీ అంచనాలు..
- కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల్లో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ 7.4 శాతం వృద్ధి చెందుతుందని, ఇది 2024-25లో 6.5 శాతంగా ఉన్న వృద్ధి కంటే ఎక్కువ అని కేంద్రం బుధవారం ముందస్తు అంచనాల్లో తెలిపింది. కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటున్న కారణంగా, యూఎస్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత జీడీపీ మెరుగైన వృద్ధిని సాధించింది.
Read Also: Trump: ప్రధాని మోడీ నన్ను ‘‘సార్’’ అన్నారు.. ట్రంప్ తాజా కామెంట్స్..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంట్ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడిన 7.3 శాతం రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) వృద్ధి రేటులో సేవల రంగంలో మంచి వృద్ధి, జీడీపీ వృద్ధికి ప్రధాన కారణంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు ఏడు శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేయగా, వ్యవసాయం, విద్యుత్, నీటి సరఫరా వంటి యుటిలిటీ సేవల వృద్ధి మితంగా ఉంటాయని భావిస్తున్నారు.
ప్రస్తుత ధరల వద్ద ఉండే నామమాత్రపు జీడీపీ, ఈ ఏడాది 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అంచానాలు రూ. 187.97 లక్షల కోట్లతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 201.9 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని, దీంతో 7.4% వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయబడింది. ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 330.68 లక్షల కోట్లతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 357.14 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడింది, ఇది 8% వృద్ధి రేటును చూపుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!