Sunrisers Hyderabad Playoffs Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. అటు హైదరాబాద్, ఇటు లక్నోకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే.. ఇరు జట్లకు విజయం తప్పనిసరి. గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత…
Rain likely To Stop SRH vs LSG Match in Uppal Stadium Today: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సన్‌రైజర్స్, లక్నో టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్‌కు…
సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించింది. చివరి బంతికి రాజస్థాన్‌కు రెండు పరుగులు కావాల్సి ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన యార్కర్‌తో రాజస్థాన్ రాయల్స్ రోమన్ పావెల్ ని అవుట్ చేశాడు. దానితో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ చివరి బంతికి విజయం సాధించడంతో ఆనందంతో…
ఉప్పల్ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది…
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో మార్చి 27న హైదరాబాద్, ముంబై జట్లు తలపడగా.. ఏప్రిల్ 5న హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. ఇకపోతే గురువారం నాడు హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే స్టేడియంకు ఆటగాళ్లు చేరుకొని ప్రాక్టీస్ ఉమ్మరంగా చేస్తున్నారు. Also Read: Shocking video: బైకర్‌పై దూసుకెళ్లిన…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ బిగ్ ఫైట్ ను చూసేందుకు ఆరెంజ్ ఆర్మీతో పాటు.. సీఎస్కే ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ధోనీని చూసేందుకు చాలా మంది అభిమానులు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అయితే.. ఈ మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ధోనీ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హ్యాపీగా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్‌కు ఉప్పల్ హోంగ్రౌండ్. అయితే.. అక్కడ ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఉప్పల్ స్టేడియం చుట్టూ పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే కనపడుతున్నాయి. దానికి కారణమేంటంటే.. సీఎస్కే జట్టులో ధోనీ ఉండటం. ధోనీ అంటే.. క్రికెట్ అభిమానులకు ఎంతో అభిమానం.…
Fans Try To Buy Tickets for MS Dhoni in Uppal Stadium: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఎంఎస్ ధోనీ’ నామస్మరణే. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండడం ఒకటైతే.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతుండడం రెండోది. అందుకే ఐపీఎల్ 2024లో ధోనీ ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మిస్టర్ కూల్ ఏ నగరానికి వెళ్లినా.. స్టేడియాలు…
Uppal Stadium Power Cut News: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా.. విద్యుత్‌శాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. జనరేటర్ల సహాయంతో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు చెలరేగాయి. Also Read: HCA: బ్లాక్…
ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫనా నిలిపివేశారు. అయితే కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్లనే పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ తెలిపింది. కాగా.. కొన్ని నెలలుగా బిల్లులు కట్టకపోవడంతో పవర్ కట్ చేశామని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. అందుకోసమని.. స్టేడియంలో ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా…