సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ ఉప్పల్ లో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ని చూసేందుకు ఉప్పల్ కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఉప్పల్ రూట్‌లో మెట్రో రైల్ తిరిగే సమయాన్ని పెంచింది . మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నాడు నిర్ణీత వేళలకు మించి మెట్రో రైళ్లు నడుస్తాయి.
Also Read: T20 World Cup: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూసే అవకాశం
చివరి మెట్రో రైల్ 12:15 గంటలకు టెర్మినల్ నుండి బయలుదేరుతుంది. అర్ధరాతి దాటాక ఉదయం 1 గంటలకు దాని గమ్యస్థానానికి చేరుకుంటుంది. నాగోలు, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గేమ్‌కు అన్ని సన్నాహాలు అయిపోయాయి.
Also Read: Elephant attack: ఏనుగుల దాడిలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ మృతి..
ఆట ప్రారంభానికి మూడు గంటల ముందు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. ఇక ప్రస్తుత 17వ సీజన్‌లో, సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 6 గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ గేమ్‌లో గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు పెరుగుతాయి.