సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించింది. చివరి బంతికి రాజస్థాన్‌కు రెండు పరుగులు కావాల్సి ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన యార్కర్‌తో రాజస్థాన్ రాయల్స్ రోమన్ పావెల్ ని అవుట్ చేశాడు. దానితో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ చివరి బంతికి విజయం సాధించడంతో ఆనందంతో ఎగిరి గంతేసింది. దాంతో ఆమె ఎంతో ఆనందంగా ఎగురుతూ ఎంజాయ్ చేసింది. చివరి బంతికి అవుట్ చేసి జట్టును గెలిపించిన భువనేశ్వర్, మిగిలిన ఆటగాళ్లు ఒకరినొకరు హత్తుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కావ్య పాప మళ్లీ నవ్విందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు, సన్‌రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది.
Also read: Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదటగా బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటింగ్ లో నితీష్ రెడ్డి (76 నాటౌట్; 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (58; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇన్నింగ్స్ చివరిలో క్లాసన్ 19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లలతో విద్వంస్వం సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.
Also read: Aa Okkati Adakku Review: ఆ ఒక్కటి అడక్కు రివ్యూ
అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్ (67; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ పరాగ్ (77; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), రొమైన్ పావెల్ (27; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సాధించిన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
Jumps of Joy in Hyderabad 🥳
Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡
Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc
— IndianPremierLeague (@IPL) May 2, 2024