Uppal Stadium : ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా తమకు బోనస్ ఇవ్వడం లేదని, ఇంక్రిమెంట్లు వేయడం లేదని నిరసిస్తూ సిబ్బంది ధర్నా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మ్యాచ్ టికెట్లను ఇవ్వకుండా హెచ్ సీఏ ఆఫీస్ బేరర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు సిబ్బంది.
జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ సమయంలోనే తమకు ఇంక్రిమెంట్లు ఇస్తామని అధ్యక్షుడు జగన్ మోహన్ రావు నాయకత్వంలోని కొత్త పాలక వర్గం హామీ ఇచ్చిందని, కానీ నాలుగు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ సమయంలోనే అధ్యక్షుడు జగన్ మోహన్ రావు నాయకత్వంలోని కొత్త పాలక వర్గం ఇంక్రిమెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని.. నాలుగు నెలలు గడిచినా దాన్ని పట్టించుకోలేదన్నారు. అంతేకాకుండా.. ఇంతకముందు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు బకాయిలు చెల్లించలేదని స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై హెచ్ సీఏపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!