SRH vs LSG: ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌కు చావోరేవో.. గెలిస్తేనే ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad Playoffs Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. అటు హైదరాబాద్, ఇటు లక్నోకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే.. ఇరు జట్లకు విజయం తప్పనిసరి. గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు తప్పనిసరిగా గెలవాలి. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి.. 14 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ చూస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరువ అవుతుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Sanju Samson Fine: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా.. ఇంతకీ ఏమైందంటే?
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ రోజు లక్నో కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు లక్నోతో పాటు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన గుజరాత్, పంజాబ్ చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఆడే చివరి మ్యాచ్‌లలో విజయం అంత ఈజీగా కనబడడం లేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్.. అదే మంత్రంతో బరిలోకి దిగితే విజయం సాధ్యమే. చూడాలి మరి ఆరెంజ్ ఆర్మీ ఎలా ఆడుతుందో.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?