ప్రధాని మోడీ శనివారం వారణాసిలో పర్యటించనున్నారు. రక్షా బంధన్‌కు ముందు దేశ వ్యాప్తంగా రైతులకు బహుమతి అందించనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత కింద 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే 2.3 కోట్లకు పైగా రైతులకు రూ.4,600 కోట్లు అందించనున్నారు. ఇందులో వారణాసిలో 2.21 లక్షల మంది రైతులకు రూ.48 కోట్లు ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది అన్నదాతకు రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్ 6 శాంతి ఒప్పందాలు చేశారు.. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న వైట్‌హౌస్
ఇక వారణాసిలో జరగనున్న బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. రూ.2,183.45 కోట్ల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోడీ ఉదయం 10:30కి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకనున్నారు.
ఇది కూడా చదవండి: Triangle Love: ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. ఒకరు హత్య