UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సరికొత్త నిర్ణయం
- 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం చారిత్రిక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏడు నగరాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం మహిళా సిబ్బందినే నియమించాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. లింగ సమతుల్యత కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్న మోడీ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
నెల రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం తర్వాత ప్రస్తుత సివిల్ పోలీస్ ఫోర్స్ నుంచి తీసుకోబడిన సుమారు 600 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. అక్టోబర్ నుంచి లక్నో, కాన్పూర్, ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా, గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసు కమిషనరేట్లలో మహిళా సిబ్బంది నియమితులు కానున్నారు.
ఇది కూడా చదవండి: Off The record: మిత్రపక్షం టీడీపీకే షాకిచ్చిన బీజేపీ నేత..!
లింగ సమానత్వంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు మహిళలను నియమిస్తున్నట్లు అదనపు జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సత్యనారాయణ్ తెలిపారు. మొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని.. అభ్యర్థులు క్లీన్ సర్వీస్ రికార్డ్ కలిగి ఉండాలని.. ట్రాఫిక్ విధులను చేపట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేయాలని తెలిపారు. మొదటి దశలో ఏడు కమిషనరేట్లలో ప్రతిదానిలో 13 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నట్లు వెల్లడించారు.
మహిళా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ విభాగాన్ని విస్తరించడంలో భాగంగా సివిల్ పోలీసుల నుంచి 5,000 మంది పురుష సిబ్బందిని చేర్చుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. కొత్తగా చేరిన పురుషులు, మహిళలు అందరూ జోనల్ మరియు కమిషనరేట్ కేంద్రాల్లో శిక్షణ పొందనున్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!