దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తేవడంతో విసిగిపోయి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు ఓ ప్రియుడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
ఝాన్సీలోని కిషోర్‌పురా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్.. రచనా యాదవ్ అనే ఒక వితంతువు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పదే పదే ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. దీంతో విసుగుపోయిన అతడు.. ఆమెను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. దీనికి మేనల్లుడు సందీప్ పటేల్, ప్రదీప్ అహిర్వార్ అనే మరొకరి సహాయం కోరాడు. ముగ్గురు కలిసి ఆగస్టు 8న రచనా యాదవ్‌ను అత్యంత దారుణంగా చంపేసి.. ఏడు ముక్కలుగా చేసి.. సంచుల్లో వేసుకుని పొలంలోని ఒక బావిలో పడేశారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఈ నెల 13న పొలంలోని బావిలోంచి దుర్వాసన రావడంతో రైతు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక నీటిలో తేలియాడుతున్న రెండు సంచుల్లోని మహిళ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్గానికి తరలించారు. ఇక ఆగస్టు 17న ఎండిపోయిన బావిలోంచి చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇక తల, కాళ్లు కనిపించకపోవడంతో గుర్తింపు కష్టంగా మారింది. ఇక పోస్టుమార్టం తర్వాత ఆగస్టు 18న దహన సంస్కారాలు నిర్వహించారు. ఇక మృతదేహం గుర్తింపు కోసం పోలీసులు పోస్టర్లు అతికించారు. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా గ్రామంలో 100 మందిని విచారించారు. 200లకు పైగా సీసీకెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎలాంటి పురోగతి లభించలేదు.
ఎట్టకేలకు బాధితురాలు రచనా యాదవ్ సోదరుడు పోస్టర్లలో ఉన్న దానిని బట్టి గుర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్‌తో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. మాజీ సర్పంచ్‌తో రచనా యాదవ్‌కు సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేశాడు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం రూ.25,000 రివార్డ్ ప్రకటించారు. రచనా యాదవ్‌ది
ఝాన్సీకి రెండు గంటల దూరంలో ఉన్న టికమ్‌గఢ్‌కు చెందిన వితంతువుగా పోలీసులు గుర్తించారు. భర్త చనిపోయాక సంజయ్ పటేల్‌తో సంబంధం పెట్టుకున్నట్లుగా కనిపెట్టారు. అయితే ఈ మధ్య పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో వదిలించుకోవాలన్న నిర్ణయంతో చంపేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బాధితురాలి తల, కాళ్లకు సంబంధించిన భాగాలు లఖేరి నది నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తును చేయడానికి 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక దర్యాప్తు పూర్తి చేసినందుకు బృందానికి రూ.50,000 రివార్డు ప్రకటించారు.