ప్రియరాళ్ల కోసం ప్రేమికులు ఎంతకైనా తెగిస్తుంటారు. అర్ధరాత్రి.. అపరాత్రి అనకుండా చాటుగా వచ్చి కలిసి వెళ్తుంటారు. అదే ఓ ప్రేమికుడి పాలిట శాపమైంది. ప్రియురాలిని కలిసేందుకు గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే దొంగల కోసం కాపాలా కాస్తున్న స్థానికుల కంట్లో చిక్కాడు. ఇంకేముంది దొంగగా భావించి చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Amit Shah: మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అర్ధరాత్రి డ్రోన్ దొంగలు తిరుగుతున్నారని కలకలం చెలరేగింది. డ్రోన్‌ల ద్వారా ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో దొంగల కోసం స్థానికులు కాపాలా కాస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పొరుగు ఊరుకు చెందిన యువకుడితో సంబంధం ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి ఆమెను కలిసేందుకు ఇద్దరు స్నేహితులతో ప్రేమికుడు గ్రామంలోకి వచ్చాడు. అంతే అప్పటికే దొంగల కోసం కనిపెడుతున్న గ్రామస్తులకు.. ఈ ముగ్గురు కంటపడ్డారు. ఇంకేముందు డ్రోన్ దొంగలుగా భావించి ఎటాక్ చేశారు. ప్రేమికుడు దొరికిపోగా.. మరో ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. ప్రేమికుడిని పట్టుకుని చితకబాదారు.
ఇది కూడా చదవండి: Karnataka: ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!
అయితే గ్రామంలోకి ఎందుకు వచ్చాడో విషయం తెలియజేయలేదు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ దొంగల పుకారుతో పాపం అడ్డంగా బుక్కైపోయాడు.