Kanwar Yatra: కన్వార్ యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా దుకాణాలపై ప్రదర్శించాలన్న ఆదేశాలను తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొనింది.
దేశంలోని ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.
ఉత్తరప్రదేశ్ క్రైమ్ కు అడ్డగా మారింది. నిత్యం యూపీలో అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్.. అతని సోదరుడు అతీక్ అష్రఫ్ అహ్మద్.. తమను చంపేస్తారని ప్రాణభయంతో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. శనివారం రాత్రి.. వీరిద్దరిని దుండగులు అతి దారుణంగా కాల్పి చంపారు.
లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు…
Free Bus Ride For Women: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే నేరస్తులకు, మాఫియాకు ఎంతటి భయమో అందరికి తెలుసు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితుల ఇంటి ముందుకు బుల్డోజర్లు క్యూ కడుతాయి. శాంతి భద్రతల విషయంలో యోగి ఎంత నిక్కచ్చిగా ఉంటారో.. సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... రెండో సారి యూపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
బుల్డోజర్, ఎన్‌కౌంటర్ అనగానే ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చే నేత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఎవరైనా తప్పుచేస్తే.. ఆ ఇంటి ముందు వెంటనే బుల్డోజర్ దిగిపోతుంది.. అక్రమకట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేస్తుంది.. లేదా.. పూర్తిగా కూల్చివేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. అయితే, సీఎం యోగి.. తప్పుచేసినవాళ్లపైనే కాదు.. ప్రతిపక్షాలపై కూడా బుల్డోజర్ చర్యకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన నేతపైనే బుల్డోజర్ చర్యకు దిగడం ఆసక్తికరంగా మారింది..…
2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు.…
అసలే ఎన్నికల టైం. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతుంటాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీలో ఇవాళ పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా శనివారం 60 వేలమందికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లు అందజేసింది. వీటిని అందుకున్న విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల పంపిణీపై యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి…