Atiq Ahmad : అతీక్ అహ్మద్ ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్న యూపీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్.. అతని సోదరుడు అతీక్ అష్రఫ్ అహ్మద్.. తమను చంపేస్తారని ప్రాణభయంతో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. శనివారం రాత్రి.. వీరిద్దరిని దుండగులు అతి దారుణంగా కాల్పి చంపారు. అతీక్ అహ్మద్ కుమారుడు ఈ నెల 13న పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోగా.. తాజాగా అతడ్ని, సోదరుడిని దుండగులు కాల్చిచంపారు. అతీక్ అహ్మద్ అయిదుగురు కుమారుల్లో అసద్ మృతి చెందగా.. మిగతా నలుగురిలో ఇద్దరు కుమారులు జైల్లో ఉన్నారు. మైనర్లయిన ఇద్దరు కుమారులు గృహ నిర్భందంలో ఉన్నారు. అతీక్, అష్రఫ్ భార్యలు పరారీలో ఉన్నారు.
Also Read : YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజు పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు.. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. అతీక్ పై వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజు పాల్ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో కిడ్నాప్ కు గురై విడుదల అయ్యాడు. 2007లో అతడు, అతీక్, అష్రఫ్తో పాటు మరికొందరిపై కిడ్నాప్ కేసు పెట్టాడు.
Also Read : Varuthini Ekadashi: వరూధిని ఏకాదశి రోజు ఈ స్తోత్రాలు వింటే ధన ప్రాప్తి సిద్ధిస్తుంది
కిడ్నాప్ కేసు విచారణ చివరి రోజైన ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ అతీక్ కుటుంబ సభ్యులే ప్రధాన నిందితులు. ఉమేశ్ పాల్ హత్య కేసు విచారణ నేపథ్యంలో బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేస్తారని అతీక్ అహ్మద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి అక్కడ చుక్కెదురైంది. అప్పుడు గుజరాత్ సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న అతీక్ ను ఓ కేసు అతీక్ ను చివరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read : Surya Stotra: సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మోక్షం పొందుతారు
అయితే తనను రెండు వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తామని ఓ సీనియర్ అధికారి బెదిరించినట్లు అష్రప్ ఇటీవల ఆరోపించారు. ఒకవేళ తాను హత్యకు గురైతే ఆ అధికారి పేరు ముఖ్యమంత్రికి చేరుతుందన్నారు. మరోవైపు అతీక్ నేరసామ్రాజ్యాన్ని కూల్చేస్తున్న యోగి సర్కార్.. అతీక్ అహ్మద్ ఆర్థిక మూలాలను పెకిలించి వేస్తున్నారు. అతీక్ అహ్మద్, అతని అనుచరుల అక్రమాస్తుల్లో ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయల విలువైన సంపదను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో 108 కోట్ల రూపాయల నల్ల ధనాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు గుర్తించారు. అతీక్ అహ్మద్ కు సంబంధించిన వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!