దేశంలోని ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. భాగ్యలక్ష్మి యోజనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఈ పథకం అమలు ఉద్దేశం.
యూపీ భాగ్య లక్ష్మి యోజన కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమె తల్లికి రూ. 50,000 బాండ్, రూ. 5,100 మొత్తం ఇవ్వబడుతుంది. ఆడపిల్ల 6వ తరగతికి రాగానే తల్లిదండ్రులకు రూ.3000, బాలిక 8వ తరగతికి రాగానే తల్లిదండ్రులకు రూ.5000, బాలిక 10వ తరగతికి రాగానే తల్లిదండ్రులకు రూ.7000, బాలిక 12వ తరగతికి రాగానే తల్లిదండ్రులకు రూ.8000 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తోంది. ఇది కాకుండా, కుమార్తెకు 21 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది.
Also Read:Ashok Gehlot: మాలో మాకు గొడవలు పెట్టొద్దు.. పైలట్ వ్యవహారంపై గెహ్లాట్ చురకలు
యూపీ భాగ్య లక్ష్మి యోజనలో అర్హతకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అమ్మాయి కుటుంబం ఉత్తరప్రదేశ్ నివాసి అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ఆడపిల్ల పుట్టిన నెలలోపు అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించాలి. బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. యూపీ భాగ్య లక్ష్మి యోజన కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా లాంటి పత్రలు అవరసమవుతాయి. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి, మీ సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు అప్లై చేసుకోవాలి. ఇది కాకుండా, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఉత్తరప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.