ఇదివరకు ప్రకటించిన లిస్ట్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జడేజా కూడా ఒక భారత ఆటగాడు. జడేజా బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుండి క్యాప్ అందుకున్న ఫోటోలను పంచుకున్నారు. “ప్రత్యేక వ్యక్తి నుండి ప్రత్యేక క్యాప్” అనే పోస్ట్‌కు క్యాప్షన్ ను ఈ ఫోటోలకు జత చేసాడు…
అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల…
ఇటీవల కాలంలో అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఆయుధాల తయారీలో అమెరికా అగ్రస్థానంలో ఉండటం కూడా దీనికి కారణం. అయితే గత నెలలో న్యూయార్క్, టెక్సాస్‌లో సామూహికంగా కాల్పులు జరిగాయి. ఆయా ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అమెరికాలో తుపాకుల వినియోగం నియంత్రణకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గన్ కంట్రోల్ చట్టాన్ని ఆమోదిస్తూ తాజాగా జో బైడెన్ సంతకం చేశారు.…
గత వారం ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల సంఘటన అమెరికాను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే! దీని నుంచి ఆ అగ్రరాజ్యం ఇంకా కోలుకోకముందే.. మరిన్ని కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్లహామాలోని తుల్సా ఆసుపత్రిలో ఒక దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తి, ఆ ఆసుపత్రికి ఓ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం వచ్చాడు. ఆయన కనిపించకపోయేసరికి, ఆ వ్యక్తి సహనం కోల్పోయి ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే తనతో తెచ్చుకున్న తుపాకీతో…
2018 ఫిబ్రవరిలో నికోలస్ క్రూజ్ అనే 19 ఏళ్ల టీనేజర్ ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో కాల్పులకు పాల్పడ్డాడు. AR-15 రైఫిల్‌తో అతడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. అభం శుభం తెలియని చిన్నారులను అకారణంగా కాల్చి చంపటం అందరి మనసులను కలచివేసింది. అగ్రరాజ్యం అమెరికాలో పెచ్చరిల్లుతోన్న గన్ కల్చర్‌కు ఇది ఒక ఉదాహరణ. సరిగ్గా ఐదేళ్ల తరువాత నాటి ఫ్లోరిడా…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న వారికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్ తప్పకపోవచ్చు. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచాన్ని చమురు ధరలు కమ్మేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు దాటవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది శరాఘాతం వంటిది. వాటిని ఆర్థిక సంక్షోభంలో పడేస్తుంది. చమురు ధరల భారాన్ని మోసే శక్తి చాలా దేశాలకు లేదు. అయితే రెండు దేశాలకు మాత్రం ఆ బాధ లేదు.…