యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ చాలా తెలివిగా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. రెండు దేశాలలో నివసించడానికి, పని చేయడానికి యువ బ్రిటీష్, భారతీయ నిపుణుల కోసం కొత్త మార్పిడి పథకాన్ని ప్రారంభించారు.
గత వారంలో మూడు రోజుల పాటు ఢిల్లీ, ముంబైలో గల బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ సర్వే కార్యకలాపాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బీబీసీని, దాని సంపాదకీయ స్వేచ్ఛను గట్టిగా సమర్థించింది.
UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్‌బెల్ట్ తొలగించారు.
కింగ్ చార్లెస్ III చిత్రాన్ని కలిగి ఉన్న కరెన్సీ నోట్లు 2024 మధ్య నాటికి చెలామణిలోకి రానున్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మంగళవారం వాటి డిజైన్లను ఆవిష్కరించింది. 5, 10, 20, 50 పౌండ్ల పాలిమర్ నోట్లపై డిజైన్‌పై కింగ్ చార్లెస్ ఫోటోను ముద్రించనున్నారు.
లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండగులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డామ్‌లో అతి పిన్న వయస్కుడైన మొదటి ప్రధానిగా రికార్డు సృష్టించారు.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతిపిన్న ప్రధాని రిషి సునాక్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అది కూడా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో.. ఇదే కదా అసలైన పండుగ అంటూ దీపావళి సంబరాలను హోరెత్తించారు భారతీయులు.. అయితే, రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన నేపథ్యంలో.. ప్రపంచంలోని పలు దేశాల్లో కీలకంగా పనిచేస్తూ…
ఎట్టకేలకు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్‌లో అత్యధికంగా రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయన యూకే ప్రధాని అయ్యారు.
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. రిషికి 100 మందికి పైగా పార్టీ అభ్యర్థుల మద్ధతు లభించినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.