New UK Currency: కింగ్ చార్లెస్ III చిత్రాన్ని కలిగి ఉన్న కరెన్సీ నోట్లు 2024 మధ్య నాటికి చెలామణిలోకి రానున్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మంగళవారం వాటి డిజైన్లను ఆవిష్కరించింది. 5, 10, 20, 50 పౌండ్ల పాలిమర్ నోట్లపై డిజైన్‌పై కింగ్ చార్లెస్ ఫోటోను ముద్రించనున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్‌లకు ఇతర మార్పులు ఏమీ లేవని.. కేవలం ఫోటో మాత్రమే మారుతుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక కూడా క్వీన్ ఎలిజబెత్ ఫోటోతో కూడిన పాలిమర్ నోట్లను ఉపయోగించవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రాణి ఫొటోలు ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం బ్యాంకులకు చేరుకునేందుకు సమయం పడుతుందని చెప్పింది. కొత్త కరెన్సీ నోట్లు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన ఫోటోతో ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. కొత్త నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో మాత్రమే మారింది. మిగతా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
China: చైనాలో నిమ్మకాయలకు భలే డిమాండ్.. కొవిడ్‌తో పోరాడుతున్న డ్రాగన్
దాదాపు 70 ఏళ్లు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. దీంతో ఆయన కుమారుడు చార్లెస్-3 కొత్త రాజు అయ్యారు. బ్రిటన్‌లో రాజు లేదా రాణి ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు. ఈ డిజైన్ ఇటీవలి నెలల్లో ఖరారు చేయబడి రాజుచే ఆమోదించబడింది. 2023 మొదటి సగం నుంచి నోట్లను భారీగా ఉత్పత్తి చేయాలని పేర్కొంది. ప్రస్తుత పాలిమర్ నోట్లు 2016 నుంచి యూకేలో క్రమంగా కాగితపు డబ్బును భర్తీ చేస్తున్నాయి. కింగ్ చార్లెస్ III చిత్రపటాన్ని కలిగి ఉన్న మా కొత్త నోట్ల డిజైన్‌ను బ్యాంక్ విడుదల చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ ఒక ప్రకటనలో తెలిపారు.
Today we unveiled the design of the King Charles III £5, £10, £20 and £50 banknotes. They are expected to enter circulation by mid-2024. You can continue to use polymer banknotes with a portrait of Queen Elizabeth II. Visit our website for more details. https://t.co/i5eqAhxrKY pic.twitter.com/BkYTZ0VopZ
— Bank of England (@bankofengland) December 20, 2022