BJP Rally: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి స్వాగతం పలికేందుకు బీజేపీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణకు వందనం పేరుతో బీజేపీ ర్యాలీ, సభ జరగనుంది. మోడీ 3.0 లో కేంద్ర మంత్రి పదవి చేపట్టి మొదటి సారి తెలంగాణకు వస్తున్న కిషన్ రెడ్డికి బేగంపేటలో భారీ స్వాగత కార్యక్రమం చేపట్టారు బీజేపీ శ్రేణులు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలు పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సభకు ఏర్పాట్లు చేశారు. సభలో మంత్రులకు, ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read also: Rachakonda Police: అందుకే కదా అర్థాంగి అంటారు.. ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్..
ఆ తరవాత భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు నేతలు దర్శించుకోనున్నారు. రసూల్ పూర, ప్యారడైజ్, రానిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, హిమాయత్ నగర్ ల మీదుగా బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీని చేపట్టనున్నారు. ర్యాలీ జరిగే రూట్ లో భారీగా ఫ్లెక్సీ లు, బానర్ లు, జండాలు, హోర్డింగ్స్ లను బీజేపీ నేతలు ఏర్పాటు చేసారు. తెలంగాణ పేరుతో నిర్వహించే ఈ ర్యాలీలో లక్ష్మణ్, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయ వేదికపై నుంచి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతామని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న కార్యకర్తలు, నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతారని తెలిపారు.
Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..