Kishan Reddy: యామినీ కృష్ణమూర్తి మృతికి కేంద్రమంత్రి సంతాపం
- యామినీ కృష్ణమూర్తి మృతికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం
- దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయురాలు అని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నృత్యకారిణి, పద్మ విభూషణ్ యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల కేంద్ర కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతపం తెలిపారు. భారతదేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రఖ్యాతి గడించిన పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇకలేరనే వార్త విచారకరం అన్నారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో దేశ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయురాలు అని కొనియాడారు. ఢిల్లీలో స్థాపించిన ‘యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్’ నృత్యరంగంలోకి రావాలనుకునే వారికి ఓ విశ్వవిద్యాలయం లాంటిదన్నారు. అంతటి గొప్ప కళాకారురాలు మన తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. యామినీ కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని కేంద్రమంత్రి తెలియజేశారు.
Also Read
ఢిల్లీలో మృతి..
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) శనివారం కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో యామినీ కృష్ణమూర్తి జన్మించారు. పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులు అందుకున్నారు.
యామినీ కృష్ణమూర్తి 1957లో మద్రాస్‌లో రంగప్రవేశం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకి అనే గౌరవం ఉంది. ఆమె కూచిపూడి నృత్య రూపానికి టార్చ బేరర్ అని కూడా పిలుస్తారు. ఇక ఢిల్లీలోని హౌజ్‌ఖాస్‌లోని యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌లో యువ నృత్యకారులకు పాఠాలు నేర్పారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ అవార్డులు సొంతం చేసుకుంది. ఇక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!