ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ ‘హునార్ హాత్’లో 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు నుండి 700 మందికి పైగా కళాకారులు మరియు హస్తకళాకారులు గొప్ప సంప్రదాయ సమర్పణలతో పాల్గొంటున్నారు. మార్చి 6 వరకు జరిగే ఈ ఎక్స్‌పో కళాకారులు, హస్తకళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడేళ్లలో ఈ ఈవెంట్‌లు దాదాపు 8 లక్షల మంది కళాకారులు మరియు కళాకారులకు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కల్పించాయని నిర్వాహకులు…
ఎంతో మంది కళాకారులు నైపుణ్యంతో వస్తువులు తయారు చేస్తున్నారని, కళాకారులకు ప్రోత్సాహం అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు హస్త కళలను ప్రోత్సహించాలని, మార్చి 6వ తేదీ వరకు హునర్ హాట్ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. ఏ దేశానికి మనం తక్కువ కాదు, గొప్ప వారసత్వం మనదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా విదేశాలకు వెళ్ళినప్పుడు…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్‌లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని…
రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ఎవరు అడ్డుకున్నారు.? బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిపై నిందలు ఆపండని ఆయన అన్నారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలిస్తామన్న హామీ మాత్రమే ఉందని, 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రధాన డిమాండ్ బయ్యారం ఉక్కు…
సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి నిస్సహాయ ప్రకటన చేసినా అర్థం ఉందని, కానీ ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉంది కూడా నిస్సహాయంగా ఉన్నారని మంతి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రంది ఉక్కు…
తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50…
దేశ అభివృద్ధికి మంచి రోడ్లు కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో 2 వేల 482 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ లో 2 వేల 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని ఆయన వెల్లడించారు. 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్క పెద్దపల్లి…
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వని వారు ఇక్కడ రాజకీయ లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతూన్నారో తెలియదని, అమ్మ సన్నిధిలో పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారన ఆయన విమర్శించారు. ఎడేల్లు గా పాలన చేస్తున్న మోది మేడారం జాతరకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి గుడికి వెళ్లే ప్రధాని…
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. సమ్మక్క-సారక్కలు గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి కన్నుల పండువగా దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీస్ శాఖ 9 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు…
నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు. నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3…