ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్‌లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని తీసుకు రావడానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని తెలిపారు కిషన్‌రెడ్డి.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో 423 మంది ఏపీ విద్యార్థులు..
ఉక్రెయిన్ చుట్టు పక్కల ఉన్న దేశాల్లో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. విద్యార్థులను సొంత ఖర్చులతో ఇండియాకి తీసుకొస్తున్నాం.. భారత జెండా కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రష్యాతో ఒప్పందం చేసుకున్నామన్నారు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు… ఆలస్యం అయినా ఎవరికి హాని కలగ కుండా ఇండియాకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. చర్చల ద్వారా పరిష్కారం చేసుకొవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తెలిపారని గుర్తుచేసిన కిషన్‌రెడ్డి.. అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్ రెండూ దేశాలు మనకు మిత్ర దేశాలే.. మనకు శత్రువు ఒక పాకిస్థాన్ మాత్రమేనని.. ఆందోళన వద్దు.. అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేరుస్తాం అని వెల్లడించారు.