ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర…
తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉంది. టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తుంటే.. అది కూడా డైరెక్టుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీజేపై విమర్శల వర్ష కురిపిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ అధినేతతో సహా నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో నన్ను ఓడిస్తారా అని అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమ కారులతో…
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు సహించన్నారు. కేసీఆర్ నిజాంల పాలన కొనసాగించాలని… తను ,తన తరవాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏమి చేసిందో చర్చించేందుకు సిద్ధం. సీఎం సవాల్ స్వీకరిస్తున్నా అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘హిందూస్థాన్, పాకిస్థాన్’ అనేది బీజేపీ జీవితకాల నినాదమని, ‘వీరి నాయకులకు జ్ఞానం లేదని’ ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తలసాని.. గత మూడేళ్లలో హైదరాబాద్‌కు కిషన్ ఏం చేశారని ప్రశ్నించారు. వరద సాయం కోసం కూడా కిషన్ ఒక్క రూపాయి…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. “పోలీసులను 15 నిమిషాలు తొలగిస్తే, మేము ముస్లింలు 100 కోట్ల హిందువులను అంతం చేస్తాం” అన్న ఒవైసీ, ఎంఐఎంతో సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు కలిసి పొత్తుపెట్టుకోవడం…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.. తనకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది.. స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వైద్యుల సూచనల…
నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణతో పాటు పలువురికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందని స్వాతంత్ర సమర యోధులను గుర్తించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరి లేకపోతే మనలో ఆ తెగింపు రాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా…
ప్రముఖ నటుడు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసింది. సరిగ్గా అదే సమయంలో అతను నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలైంది. అయితే చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరిన సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేదు. చావు అంచువరకూ వెళ్లి తిరిగొచ్చిన సాయితేజ్ తను ఆరోగ్యం గురించి ఆరా తీసిన వాళ్ళకు ఆమధ్య కృతజ్ఞతలు తెలిపాడు. మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ, రాజకీయ…
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్‌ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం…