నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు.
నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3 జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
నేడు భారత్, వెస్టండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడీ టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. అయితే నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
నేడు గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆత్మకూరు కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ వారు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు.
నేడు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్‌లో పర్యటించనున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం లక్నోలో రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తంగళపల్లి మండలం బద్దెనపల్లి రైతువేదికను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఎల్లమ్మ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
నేడు మేడారంకు తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కిషన్‌రెడ్డి సమ్మక్క-సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.