వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్‌కు 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి…
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేయాల్సి రావడం కేంద్రానికి సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్… వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కార్.. హస్తిన వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు..…
తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తూనే ఉంది.. వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిందంటూ మరోసారి.. బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఎండగట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. 2021-22లో తెలంగాణకు ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించలేదంటూ ఓ నివేదికను ట్విట్టర్‌లో షేర్ చేశారు.. 2020లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఎమ్మెల్సీ…
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసింది… భారత్ ఇప్పటి వరకు 5,02,874 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఘోరంగా దెబ్బకొట్టింది.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగి ఆందోళనకు గురిచేసింది.. ఇక, కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం సంచలనంగా మారింది.. కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.. యూపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
యాసంగి పంట కొంటారా…కొనరా… సీదా అడుగుతున్నాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండేది దొడ్డు వడ్లు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదాం. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని అడిగారు. రైతు చట్టాలు రద్దు రైతుల విజయం..రైతుల పోరాటం తో కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ రైతుల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా లో చేపట్టారు. రైతులు ఆందోళనల…
ఏడేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం ఒరిగింది..? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? అంటూ నిలదీశారు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాడు 2014లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉంటే.. దేశంలో పెట్రోలు రూ.77, డీజిల్ ధర రూ.68కి లభించింది.. ఇప్పుడు క్రూడాయిల్ ధర 83 ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ.115, డీజిల్ ధర రూ.107గా ఉందని గుర్తుచేశారు.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల…
పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో రోజురోజుకూ పైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలకు బ్రేక్‌లు వేయాలన్న ఉద్దేశంతో.. ఇప్పటికే లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలకు అడుగులు వేస్తూ.. వాహనదారులకు ఊరట కలిగించేలా.. తమ పరిధిలోని వ్యాట్‌ను తగ్గిస్తూ శుభవార్త వినిపించాయి.. కేంద్రం నిర్ణయం వెలువడిన రోజు కొన్ని…
పెట్రో ధరల మంట సామాన్యుడికి భారంగా మారిపోతోంది.. పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పైకి ఎగబాకుతుండడంతో.. నిత్యావసరాలు మొదలు, ఇతర వస్తువలపై కూడా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే, పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన ప్రతీసారి.. ఇక, ఈ సారి.. చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. అయితే, పెట్రోల్, డీజిల్…
దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్‌మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్టు-2015, మైన్స్, మినరల్స్ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం…