జూన్ మొదటి వారంలోగా ఆంధ్రప్రదేశ్‌లో 42 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. కోవిడ్ కేసులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్న పిటిషన్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత ఉందని.. ఇప్పటి వరకు 4 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కొనుగోలుకి సిద్ధంగా దరఖాస్తు చేశామని కోర్టుకు విన్నవించింది ప్రభుత్వం. గ్రామ…
కరోనా విజృంభణతో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.. అయితే, 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది కేంద్ర ప్రభుత్వం.. నేటితో ఆ గడువు కూడా ముగిసిపోయింది.. ఇంటర్ పరీక్షలతో పాటు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై తన వైఖరిని కేంద్రానికి తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం.. పరీక్షలు నిర్వహించాలన్న సీబీఎస్ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.. పరిస్థితిలు చక్కబడితే జులై రెండో వారం తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది… పరీక్ష…
తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భరత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను ఆరు వారాలకు…
కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల…
కరోనా వైరస్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూడగా… సెకండ్‌వేవ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సవాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా కరోనా విస్తరిస్తోండగా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…