మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా…
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. ఈ సమయంలో డ్రోన్ ల ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మందులు, వాక్సిన్ సరఫరా చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రయోగాత్మకంగా మొదట తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 11 న లాంఛనంగా వికారాబాద్ లో…
కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్‌లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్‌లో…
ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను దగాచేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ,24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్టు ను అందించడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు,…
కేసీఆర్ రైతు బందు ప్రకటించినప్పుడు ఎలక్షన్ కోసమేనని ప్రతి పక్షాలు విమర్శించాయికానీ ఇప్పటవరకు 43 వేల కోట్లరూపాయలు.. 7 విడతలుగా రైతులకు ఇచ్చుకున్నాము. రైతులకోసం భారతదేశంలో ఏ రాష్టం అమలుచేయని సంక్షేమపథకాల్ని తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నాము అని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు వేదికల ద్వారా రైతులు ఏ భూములలో ఎటువంటి పంటలు వేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయం పై సూచనలు చేస్తాము. కేసీఆర్ ఉన్నంత…
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 62 ఎకరాల్లో 325 పడకల ఆస్పత్రి కొనసాగుతుంది అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 1200 బెడ్స్ తో వెయ్యి కోట్లతో ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉంది. 5 వేల కోట్లతో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నాలుగు గేట్లు ఉండేలా… పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఎమ్మెల్యే మాగంటి.…
ప్రజలు కష్టాల్లో వుంటే కరోనా కట్టడి పేరుతో ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. అశాస్త్రీయ పద్దతిలో వేక్సినేషన్లు వేస్తున్నారు అని తెలిపారు. చెత్తకు పన్నులు వేస్తారా… 15 శాతానికి మించి ఆస్తిపన్ను పెంచామంటే ప్రజలకు ఏమి అర్ధమవుతుంది. పన్నులు పెంచుతోంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నోటికి ప్లాస్టర్లు వేసుకుని వున్నారా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్లిప్రజల నుంచి చెత్తను కొనుక్కోండి.. వాటిని అమ్ముకోండి.. ప్రజలపై భారాలు వేయకండి అన్నారు. పన్నుల…
పెట్రోల్,డిజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ నేతల ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్,డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… ప్రభుత్వం 35 రూపాయలు పెట్రోల్ కి 65 రూపాయల టాక్స్ వసూలు చేస్తుంది అన్నారు. సాధారణ ప్రజల దగ్గర ఇంత దోచుకుంటూ పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యాపారులు చెల్లించనీ లోన్లు…
కరోనా వ్యాక్సిన్ల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై కూడా లేదన్నారు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్రానికి ముందు చూపు…