తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తూనే ఉంది.. వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిందంటూ మరోసారి.. బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఎండగట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. 2021-22లో తెలంగాణకు ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించలేదంటూ ఓ నివేదికను ట్విట్టర్‌లో షేర్ చేశారు.. 2020లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Dharmana: తమ్ముడు కూడా సమర్థుడు.. నా స్థానంలో మంత్రి పదవి మంచిదే..!
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు ఎమ్మెల్సీ కవిత.. కాగా, 2021-22లో వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్డీఆర్‌ఎఫ్) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. కేంద్ర నివేదికను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కవిత.. ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని ప్రస్తావించారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని పేర్కొన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదంటూ మండిపడ్డారు.. ఇక, ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపూరిత వైఖరితో మనసు కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. 2021-22లో అనేక రాష్ట్రాలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం… తెలంగాణకు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని దుయ్యబట్టారు.. తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకొందని గుర్తుచేశారు.. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ నిధులివ్వాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ గతంలోనే లేఖ రాశారని.. కానీ, ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత.
In the year 2020, Hyderabad witnessed one of the worst natural calamity – a series of floods. The State Govt under CM Sri KCR stood like a wall for the people and our only hope was support from the centre 1/2 pic.twitter.com/wnT9F5u2TU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 7, 2022