KCR: కేంద్రానికి కేసీఆర్ డెడ్‌లైన్.. 24 గంటల్లో తేల్చకపోతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్‌కు 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి అహంకారం ఎందుకు? అని నిలదీశారు.. ధాన్యం కోనుగోళ్లపై కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్.. కేంద్రం వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోకపోతే.. మేమే నిర్ణయం తీసుకుంటామన్నారు.
Read Also: Rakesh Tikait: తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్రానికి సిగ్గు చేటు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇక, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్.. పీయూస్ గోయల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన.. నూకలు తీనమన్నాడు.. ఆయన పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్‌మాల్ అని మండిపడ్డారు.. గోయల్ ఉల్టా ఫల్టా మాట్లాడుతున్నారు.. పీయూష్ గోయల్‌కు ఏమైనా అవగాహన ఉందా? మాకు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని నిలదీశారు.. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరారు.. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం.. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోడీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ, రైతుల వద్ద మాత్రం పెట్టుకోవద్దు అని హెచ్చరించారు.. మరోవైపు.. హైదరాబాద్‌లో బీజేపీ ఎందుకు ధర్నా చేస్తుంది? అని ప్రశ్నించారు కేసీఆర్.. బీజేపీ సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందన్న ఆయన.. కేంద్రం ప్రతి గింజా కొంటుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేశారు… మరి, తెలంగాణ ధాన్యం కొనడానికి కేంద్రానికి డబ్బుల్లేవా, మనసు లేదా? అని నిలదీశారు.కేంద్రంపై ఫైర్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!