Union Budget: సండే మూడ్‌ను.. మార్కెట్‌ను రెండూ నాశనం చేశారు.. నిర్మలమ్మ బడ్జెట్‌పై నెట్టింట విమర్శలు
- నిర్మలమ్మ బడ్జెట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
- సండే మూడ్‌ను.. మార్కెట్‌ను రెండూ నాశనం చేశారంటూ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కారణంగా మార్కెట్ కూడా సండే ఓపెన్ కావాల్సి వచ్చింది. ఇక బడ్జెట్‌లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే అది లేదు. పేదోడికి.. సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటనలు ఏవీ రాలేదు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకైనా తాయిలాలు ఉంటాయనుకుంటే అది లేదు. మరోవైపు స్టాక్ మార్కెట్ అయినా లాభాల్లో దూసుకెళ్లిందా? అంటే అది లేదు. పెట్టుబడిదారులకు బడ్జెట్ ఏ మాత్రం రుచించలేదు. దీంతో 8 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పంచ్‌లు పేలుతున్నాయి. నిర్మలమ్మ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సండే మూడ్‌ను.. మార్కెట్‌ను రెండూ నాశనం చేశారంటూ ధ్వజమెత్తుతున్నారు. మధ్యతరగతి ప్రజల దుస్థితిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. మధ్యతరగతి వారికి సెలవు లేదు.. బడ్జెట్ లేదు.. ఆదివారం సమయం వృధా అయిందని మరొకరు విమర్శించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇది కూడా చదవండి: UP: 9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!
నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటించారు. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు ఉండబోతున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుగా అంచనా వేశారు.

Middle Class waiting for Tax Relief in #Budget #Budget2026 pic.twitter.com/Va4O26Ez8q
— अkhil✨️ (@bas_kar_oyee) February 1, 2026
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!