ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల్లో చిక్కుకుని పోయారు. తూర్పు ఉక్రేయిన్ లోని “సుమీ” పట్టణంలో చిక్కుకుపోయారు 500 మంది భారతీయ విద్యార్థులు. రష్యా సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే దూరంలో ఉంది సుమీ పట్టణం. వెనువెంటనే తమను రష్యా గుండా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విద్యార్థులు. ఉక్రెయిన్ పశ్చిమ వైపునకు వెళ్లడానికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రస్తుత…
ఒక్క యుద్ధం.. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఇదే సంగతి చెప్పాయి. తాజాగా ఉక్రెయిన్ వార్..మన పొరుగుదేశం శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది.ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను.. చమురు ధరల పెరుగుదల నిలువునా ముంచేసింది. లీటర్ పెట్రోల్ ధర రెండు వందలు దాటింది. నిత్యవసరాల ధరలు … మరింత పెరగడంతో, సామ్యాన్యుడి బతుకు.. దినదినగండంలా మారింది.రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయనే…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖార్కివ్ నగరంలో జరిగిన రష్యా రాకెట్ దాడిలో భారతీయ విద్యార్ధి మరణించినట్టు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన విద్యార్ధిగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబంతో మాట్లాడుతున్నామని చెప్పింది విదేశీ వ్యవహరాల శాఖ. విద్యార్ఘి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది విదేశీ వ్యవహరాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి దీనిని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారత పౌరులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు సాగుతుండగా.. మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. భారత వైమానిక దళాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను మరింత వేగంగా తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం ద్వారా భారతీయులను తీసుకొచ్చేందుకు ఆలోచన…
ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది.. దీంతో ఉక్రెయిన్లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ముఖ్యంగా కీవ్ సిటీని వెంటనే ఖాళీ చేయాలని.. కీవ్‌ను భారతీయులు తక్షణమే వదిలి పెట్టాలని కేంద్రం ఆదేశించింది.. కీవ్ సిటీ నుంచి ఎలాగైనా బయటపడండి అని ఆదేశాలు జారీ చేసింది. Read Also: Zain Nadella:…
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను క్రమంగా ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, వచ్చే వారం ఐక్యరాజ్య సమితి సాధారాణ సభలో ఓటింగ్ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరగబోతోంది.. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ ఉండనుంది.. అయితే, రెండోసారి కూడా తటస్థ వైఖరినే అవలంభిస్తోంది భారత్.. ఇక, ఐక్యరాజ్య సమితిలోని 12 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది…
ఉక్రెయిన్‌లో ఆరో రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో రష్యా దాడులను మరింత ఉధృతం చేసింది. మరో రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ నగానికి 40 మైళ్ల దూరంలో రష్యా మిలెట్రీ కాన్వాయ్ ఉంది. దీనిపై శాటిలైట్ ఫోటోలు విడుదలయ్యాయి.. పుతిన్ సేనలు ఏమాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తోంది. దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ…
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది. తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం…
ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్ధులను, పౌరులను త్వరగా స్వదేశానికి తరలించాలని రాజ్యసభలో టీడీపీ నేత కనకమేడల రవీందర్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానలో ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్దులను కలుసుకుని క్షేమసమాచారాలు తెలుసుకున్నారు ఎంపీ కనకమేడల. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఢిల్లీలో అన్నిరకాల సహాయాన్ని స్వయంగా దగ్గరుండి అందించాలని చంద్రబాబు ఆదేశించారు.అక్కడినుంచి వచ్చే విద్యార్థుల వెతలను, చేదు అనుభవాలను విదేశీ వ్యవహరాల మంత్రి దృష్టికి…